telugu navyamedia
రాజకీయ వార్తలు

మహిళల రక్షణ కోసం ప్రత్యేక బెటాలియన్లు: యోగి ఆదిత్యనాథ్

yogi adityanath

మహిళల రక్షణ కోసం ఈ ప్రత్యేక బెటాలియన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు. తొలి మహిళ బెటాలియన్‌ను రాష్ట్ర గోరఖ్‌పూర్‌లో యోగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో లక్నో, బడౌన్‌ నగరాల్లో కూడా వెనువెంటనే బెటాలియన్లు ఏర్పాటవుతాయని చెప్పారు.

యూపీ ప్రభుత్వం మహిళలతో ప్రత్యేకంగా మూడు పోలీసు బెటాలియన్లు ఏర్పాటు చేస్తోంది. ఇకపై మహిళల రక్షణకు ప్రధానంగా వీరినే ఉపయోగించనున్నారు. గోరఖ్‌పూర్‌, లక్నో, బడౌన్‌ నగరాల్లో ఈ బెటాలియన్లు ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

Related posts