telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : .. ఆకస్మిక ప్రయాణాలు… అనుకున్న పనులలో విజయం …

today rasi falalu

మేషం : పనుల్లో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

వృషభం : రహస్య విషయాలు తెలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సన్మానయోగం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.

మిథునం : ఆదాయానికి మించిన ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. అనారోగ్యం. దైవచింతన. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కర్కాటకం : దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. అనుకోని ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. వస్తులాభాలు.

సింహం : ఉద్యోగయత్నాలలో అనుకూలత. వేడుకల్లో పాల్గొంటారు. వస్తులాభాలు. పాతబాకీలు కొన్ని వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

కన్య : ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

తుల : రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం : వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సందేశం. విందువినోదాలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు లభించవచ్చు.

ధనుస్సు : ఆకస్మిక ధనలబ్ధి. పనుల్లో విజయం. బంధువుల నుంచి విలువైన సమాచారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

మకరం : ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు కొంత సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

కుంభం : మిత్రులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులకు శ్రమాధిక్యం. దైవచింతన. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో గందరగోళం.

మీనం : కొత్త విషయాలు తెలుస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. అనుకున్న పనులలో విజయం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. వాహనయోగం.

Related posts