telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

నేడే జీ-20 సదస్సు.. ట్రంప్ మోడీ భేటీ..

today g-20 meet modi and trump will

నేడు ఒసాకాలో జీ-20 శిఖారాగ్ర సదస్సు జరుగుతుంది. సదస్సు రెండు రోజుల పాటు కొనసాగనుంది. జీ-20 సదస్సు కోసం వివిధ దేశాల అధినేతలు ఇప్పటికే ఒసాకా చేరుకున్నారు. వాణిజ్య, భౌగోళిక ఉద్రిక్తతలపై దేశాధినేతలు సమావేశంలో చర్చించనున్నారు. చైనా-అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధంపై, భారత్-యూఎస్ దేశాల సుంకాల పెంపుపై, ఉత్తర కొరియా, ఇరాన్ అంశాలు సహా వాతావరణ కాలుష్యంపై సమావేశంలో చర్చించనున్నారు.

జీ-20 సమావేశంలో భాగంగా భారత్, జపాన్, అమెరికా మధ్య త్రైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజోఅబే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్నారు. ట్రంప్ ఇప్పటికే ఈ సదస్సులో పాల్గొనడానికి వస్తున్నా మోడీతో సుంకాల పెంపుపై స్వయంగా తానే తేల్చుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే.

Related posts