telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

టీడీపీని వీడనున్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి!

Amanchi Krishna Mohan,Ysrcp
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్  టీడీపీని వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పందిళ్లపల్లిలో తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన ఆమంచి పార్టీ మార్పుపై సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. ఆయనతో వైసీపీ నేతలు టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  రేపు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యే అవకాశముంది. 
టీడీపీలో తనను పట్టించుకోవడం లేదని ఆవేదనలో ఉన్న ఆయన పార్టీని వీడాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమంచి వైసీసీ తీర్థం పుచ్చుకోనున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కార్యకర్తలతో సమావేశం అనంతరం ఆయన తన తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్‌లో ఉన్న ఆమంచి కృష్ణమోహన్ 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి టీడీపీలో చేరారు.

Related posts