telugu navyamedia
telugu cinema news trending

ఉపరాష్ట్రపతి నివాసంలో “సైరా” ప్రత్యేక ప్రదర్శన

Chiranjeevi

ఢిల్లీలో మెగాస్టార్ చిరంజీవి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కలిసి ఆయన నివాసంలో “సైరా” సినిమా ప్రత్యేక ప్రదర్శనను వీక్షించనున్నారు. సినిమా ప్రదర్శనకు ప్రధాని సహా పలువురు కేంద్ర పెద్దలకు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. కాగా… ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రముఖ సినీ నటుడు చిరంజీవి దంపతులు కలిశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి విజయవాడకి చేరుకున్న చిరంజీవి, ఆయన భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి వెళ్లారు. మర్యాదపూర్వకంగా తనను కలిసిన చిరంజీవి దంపతులను జగన్ సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగన్, భార్య భారతి చిరంజీవి దంపతులను ఆహ్వానించారు. అయితే ఈ భేటీలో ప్రధానంగా జగన్ చిరంజీవి “సైరా” సినిమా గురించి చర్చించారని అనుకుంటున్నారు. రాజకీయ వర్గాల్లో ఈ భేటీపై ఆసక్తికర చర్చ కొనసాగింది. చిరంజీవి జగన్ ఇంటికి చేరుకోగానే సీఎంకు షాలువా కప్పి ఘనంగా సత్కరించారు. జగన్ సతీమణి భారతికి చీర అందించారు. మరోవైపు జగన్ కూడా చిరంజీవికి వీణను బహుమతిగా ఇచ్చారు. గంట పాటు చిరంజీవి, జగన్ బేటీ జరిగింది. సైరా సినిమా చూసేందుకు జగన్ కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈనెల 5న తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ను చిరం‍జీవి మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చూడాలని ఆమెను చిరంజీవి కోరారు. చిరంజీవి ఆహ్వానం మేరకు గవర్నర్‌ ప్రత్యేకంగా ఈ సినిమాను వీక్షించారు.

Related posts

గర్ల్ ఫ్రెండ్ కావాలంటూ అతను చేసిన పనికి యువతులు ఫిదా.. ఇంతకీ అతనేం చేశాడంటే…!!?

vimala p

వైసీపీలో చేరనున్న సినీ నటుడు అలీ!

vimala p

ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ … మొబైల్స్ బొనాంజా అమ్మకాలు…

vimala p