telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

గల్ఫ్ లో .. శవాలుగా ఆంద్రోళ్ళు.. రోజుకొకటి … గణాంకాలు ..

gulf deaths of andra people revealed

స్వదేశంలో ఉపాధి కరువయ్యేసరికే ఇతర మార్గాలు వెతుక్కుంటూ.. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన ఆంధ్రుల్లో ప్రతీ రెండు రోజులకు ముగ్గురు చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో అత్యధికులు ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు తీసుకుంటుండగా, మరికొందరు రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. గత మూడేళ్లలో ఏకంగా 1,656 మంది గల్ఫ్ దేశాల్లో మృతి చెందినట్టు భారత విదేశాంగ వ్యవహారాల శాఖ తెలిపింది. లోక్‌సభలో మచిలీపట్టణం ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ శాఖ జూనియర్ మంత్రి వి.మురళీధరన్ మాట్లాడుతూ.. ఏపీలోని కడప, చిత్తూరు, గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా వలసలు ఉన్నట్టు తెలిపారు. వీరిలో చాలామంది క్లీనింగ్ స్టాఫ్‌గా, ఇంటి పనివారుగా చేస్తున్నట్టు తెలిపారు.

గత మూడేళ్లలో కువైట్‌లో అత్యధికంగా 488 మంది ఏపీ వాసులు ప్రాణాలు కోల్పోయారు. సౌదీ అరేబియాలో 478 మంది, యూఏఈలో 351 మంది, ఒమన్‌లో 153 మంది, ఖతర్‌లో 108 మంది, బెహ్రయిన్‌లో 78 మంది ప్రాణాలు కోల్పోయారు.

Related posts