telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు సామాజిక

పది పరీక్షల్లో నిమిషం నిబంధన ఎత్తివేత!

exam hall

తెలంగాణలో రేపటి నుంచి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల్లో అత్యంత కీలకమైన ఒక నిమిషం నిబంధనను తొలగిస్తున్నట్టు ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 2,530 కేంద్రాల్లో 5.34 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కానున్నారని ఆయన అన్నారు.

నిమిషం నిబంధనను ఎత్తివేసినా, విద్యార్థులు కనీసం అరగంట ముందే పరీక్షా కేంద్రానికి వస్తే మంచిదని అన్నారు. విద్యార్థులకు మంచినీటి సౌకర్యంతో పాటు లిక్విడ్ హ్యాండ్ వాష్ లను అన్ని పరీక్షా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచామని తెలిపారు. మాస్ కాపీయింగ్‌ కు పాల్పడకుండా ఫ్లైయింగ్, సిట్టింగ్ స్క్వాడ్‌ లను సిద్ధం చేశామని పేర్కొన్నారు.

Related posts