telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా పుట్టినరోజు వేడుకలు జరపకండి : రాంచరణ్

ramcharan

ప్రస్తుతం క‌రోనా భ‌యంతో స్కూల్స్‌, థియేట‌ర్స్‌, షూటింగ్స్‌, పెళ్ళిళ్ళు, షాపింగ్ మాల్స్ అన్నీ మూసివేశారు. ఇప్పటికే షూటింగ్‌లు ఆగిపోయాయి. ఈ నెలలో పుట్టినరోజులు ఉన్న సినీ ప్రముఖులు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పటికే ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేశారు.అయితే ఈ మార్చి 27న రాంచరణ్ పుట్టినరోజు కావటంతో తాజాగా చెర్రీ కూడా తన పుట్టినరోజు వేడుకులను జరపవద్దని అభిమానులకు మనవి చేశాడు. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేశాడు.అదేంటంటే `మీకు నా మీద ఉన్న ప్రేమ, నా పుట్టినరోజును పండుగగా జరపడానికి మీరు పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకోగలను. మనం ఉన్న ఈ అసాధారణ పరిస్థితులు మీకు తెలియనివి కావు. ఇలాంటి సమయంలో మనం సాధ్యమైనంతవరకు జనసాంద్రత తక్కువగా ఉండేలా చూసుకోవడం మంచిది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం నా పుట్టినరోజు వేడుకలను విరమించుకోవాల్సిందిగా నా మనవి. మీరంతా మన అధికారులకు సహకరించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విధానాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేయండి. అదే నాకు ఈ సంవత్సరం మీరిచ్చే అతిపెద్ద పుట్టినరోజు కానుక. నా మనవిని మీరంతా సహృదయంతో స్వీకరించి పాటిస్తారని ఆశిస్తున్నాను` అని చెర్రీ పేర్కొన్నాడు

Related posts