telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అన్నీ హంగులతో తెలంగాణ కొత్త సచివాలయం!

Telangana secretariate photo

తెలంగాణ నూతన సచివాలయం భవనాన్ని అత్యాధునిక హంగులతో ప్రభుత్వం నిర్మించనుంది. ఇందుకు 500 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయనుంది. ఎటువంటి వాస్తు దోషం లేకుండా ఆరు అంతస్తుల్లో అత్యంత భద్రతా ప్రమాణాలతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీర్ఘ చతురస్రాకారంలో కొత్త సచివాలయం రూపుదిద్దుకోనుంది.ఈ నెలాఖరులో నిర్మాణపనులు ప్రారంభం కానున్నాయి.

మొత్తం 27 ఎకరాలున్న ఈ స్థలంలో 20 శాతాన్ని మాత్రమే భవన నిర్మాణానికి ఉపయోగించనున్నారు. మిగిలిన ప్రదేశంలో ల్యాండ్ స్కేప్‌లు, రాష్ట్ర అధికార పుష్పమైన తంగేడు పువ్వు ఆకారంలో ఫౌంటెయిన్లు నిర్మిస్తారు. అలాగే, ఒకేసారి 800 కార్లు పార్కు చేసుకునేలా, ఒకేసారి రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు. రాజప్రాసాదంలా ఆకట్టుకునేలా ఉన్న భవన నమూనాను ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్‌ కాంట్రాక్టర్‌ డిజైన్ చేశారు.

Related posts