telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట..100 రెట్లు పెరిగిన ఆదాయం: కేటీఆర్

KTR Tribute to CRPF Jawans  Hyderabad
తెలంగాణ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట వేయడంతో నాలుగేళ్లలో  ప్రభుత్వ ఆదాయం 100 రెట్లు పెరిగిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ట్విట్టర్  ప్రభుత్వం పాటించిన సరికొత్త సాంకేతికత, పారదర్శక విధానంతో మైనింగ్ రంగంలో ఆదాయం గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. 
2004-14 మధ్యకాలంలో ఏటా రూ.3.94 కోట్ల చొప్పున ప్రభుత్వానికి రూ.39.4 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరిందని అన్నారు. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం పాలించిన 2014-18 మధ్యకాలంలో మైనింగ్ రంగంలో ప్రభుత్వ ఆదాయం ఏకంగా రూ.1,600 కోట్లకు చేరుకుందని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో పోల్చుకుంటే మైనింగ్ రంగంలో ఆదాయం పెరిగిందని  కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Related posts