telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టికల్ 257 కింద రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం చర్యలు: యనమల

Minister Yanamala comments Ys Jagan

కేంద్రం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెడితే, ఆర్టికల్ 257 కింద రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఎలాంటి చర్య అయినా తీసుకోవచ్చని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా యనమల ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసుకున్న పీపీఏ ఒప్పందాలను సమీక్షిస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు.

పీపీఏలపై సమీక్ష చేపట్టవద్దని కేంద్రం ఎందుకు సూచించిందో సీఎం జగన్ అర్థం చేసుకోవాలని యనమల తెలిపారు. ఒకవేళ ఈ సూచనలను కాదని ముందుకు వెళితే తీవ్ర తప్పిదమే అవుతుందని హెచ్చరించారు. ముఖ్యమైన విషయాల్లో కేంద్ర ప్రభుత్వం చేసే సూచనలను రాష్ట్రం పక్కన పెట్టకూడదని అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 257 కింద రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఎలాంటి చర్య అయినా తీసుకోవచ్చని గుర్తుచేశారు. ఈ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అధికారం కూడా కేంద్రానికి ఉందని యనమల పేర్కొన్నారు.

Related posts