telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇసుక వివాదాలు తీర్చే పనిలో జగన్ బిజీ: లోకేశ్

Minister Lokesh comments YS Jagan

కాకినాడలో ఆత్మహత్య చేసుకున్న భవన నిర్మాణ కార్మికుడు వీరబాబు కుటుంబాన్నిటీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వ చేతగానితనంతోనే రాష్ట్రంలో ఇసుక కొరత వచ్చిందని మండిపడ్డారు. ఇసుక వాటాల కోసం వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారని దుయ్యబట్టారు.

ఇసుక వివాదాలు తీర్చే పనిలోసీఎం జగన్ బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఓవైపు ప్రాణాలు పోతున్నా ఇసుక సమస్యను జగన్ తేలిగ్గా తీసుకుంటున్నారని లోకేశ్ వ్యాఖ్యానించారు. మీ ఇంట్లో ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఇలాగే స్పందిస్తారా? అంటూ నిలదీశారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కార్మికుడి కుటుంబానికి టీడీపీ తరఫున లక్ష రూపాయల ఆర్థికసాయం అందిస్తున్నామని ప్రకటించారు. భవన నిర్మాణ రంగ కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షలు ఇవ్వాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

Related posts