telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అంకెల గారడీ తప్ప కేటాయింపుల్లో చిత్తశుద్ధి లేదు: కళా వెంకట్రావ్‌

TDP Kala write letter to Farmers

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈరోజు అసెంబ్లీలో 2019-20 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పై విపక్ష నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పటికే మాజీ ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా టీడీపీ నేత కళా వెంకట్రావ్‌ విమర్శలు గుప్పించారు. అంకెల గారడీ తప్ప కేటాయింపుల్లో చిత్తశుద్ధి లేదని తప్పుబట్టారు.

విత్తనాలు కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, విద్యుత్‌కి రూ. 400 కోట్లు ఎలా సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. ఇది రైతులు, పేదలు, యువతకు వ్యతిరేకమైన బడ్జెట్‌ని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి రాగానే పవర్ కట్ మొదలైందని, బడ్జెట్‌లో రాష్ట్రాభివృద్ధిని పరిగణనలోకి తీసుకోలేదని కళా దుయ్యబట్టారు. బడ్జెట్‌ కొత్త సీసాలో పాత సారాలా ఉందని కళా వెంకట్రావ్‌ ఎద్దేవాచేశారు.

Related posts