telugu navyamedia
సినిమా వార్తలు

“సీత” టీజర్ : సీత కాదు శూర్పణఖ…

Sita
ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ డైరెక్ష‌న్‌లో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్న చిత్రం `సీత‌`. తాజాగా ఈ చిత్రం టీజర్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈ టీజర్లో “నువ్వు మ‌ట్టికొట్టుకు పోతావే.. నువ్వు సీత‌వి కాదే.. శుర్ప‌ణ‌క‌వి అనే డైలాగ్ తో పాటు ఇంత కంత్రి పిల్లకి ఆ పేరు పెట్టారేమిటా అనుకున్నా.. ప‌క్క‌న శ్రీరాముడున్న సంగ‌తి అర్ధం కాలేదు” లాంటి డైలాగులు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. టీజర్ చూస్తుంటే సినిమా మొత్తం కాజల్ చుట్టూనే తిరుగుతున్నట్టుగా అన్పిస్తోంది. మీరు కూడా ఈ టీజర్ పై ఓ లుక్కేయండి.  

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుద‌ల చేస్తున్నారు. శ్రీనివాస్, కాజ‌ల్ జంట‌గా న‌టిస్తున్న రెండో చిత్ర‌మిది. ప్ర‌ముఖ న‌టుడు సోనూ సూద్‌, మ‌న్నారా చోప్రా కీల‌క పాత్ర ధారులు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండ‌గా, శిర్షా రే సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం అనీల్ సుంక‌ర సార‌థ్యంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో సినిమా రూపొందుతుంది.

Related posts