telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“భాగమతి” హిందీ రీమేక్ లో అక్షయ్ ?

Akshay-Kumar

అనుష్క హీరోయిన్ గా ‘పిల్ల జమీందార్’ ఫేం అశోక్ దర్శకత్వంలో సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన “భామతి” అశేష ప్ర‌జాద‌ర‌ణ పొందింది. విద్యుల్లేఖ‌ రామన్, జయరాం, ఉన్ని ముకుందన్ మరియు ఆశా శరత్ సపోర్టింగ్ రోల్స్ లో నటించారు. భాగమతి చిత్రాన్ని తెలుగులోనే కాక తమిళం, మలయాళ భాషలలోను డబ్ చేసి విడుదల చేసారు. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో దుర్గావ‌తి పేరుతో హిందీలో రూపొందుతుంది. అనుష్క పాత్ర‌ని భూమి ప‌డ్నేక‌ర్ పోషిస్తుండ‌గా, చిత్రాన్ని అశోక్ తెర‌కెక్కిస్తున్నాడు. భోపాల్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం 2 నెల‌ల పాటు అక్క‌డే నాన్‌స్టాప్ షెడ్యూల్ జ‌రుపుకోనుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఖిలాడీ కుమార్ అక్ష‌య్ కుమార్ చిత్రంలో కామియో రోల్ పోషించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న సంగ‌తి తెలిసిందే. టీ సిరీస్‌ సంస్థతో కలిసి అక్ష‌య్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. స‌మ్మ‌ర్‌లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

Related posts