భోగిమంటలు జ్వలించగా
సంక్రాంతి దివ్వెలుగా
కనుమ గోవులుగా
పశువులను పూజింపగా
పితృదేవతలు ఆశీర్వదించగా
భారతీయ సంస్కృతిగా
ప్రతివారి మది నిండుగా
సంకురాత్రి పండుగ..!
భగభగ భోగిమంటలు
తొలిగిపోయే మలినాలు
మకరజ్యోతి వెలుగులు
జీవనజ్యోతి ఆనందాలు
కర్షకుల నట్టిల్లు
ధాన్యలక్ష్మి సిరిసంపదలు
అమ్మలక్కల రోకటిపోటులు
తీపివంటల ఘుమఘుమలు
కొత్త అల్లుళ్ల ఆహ్వానాలు
బావమరదళ్ల కొంటెదనాలు
కోడి పందేలా పోరులు
ఆటపాటల జోరులు
సంక్రాతి సంబరాలు..!
ఆశలతో
ఆనందాలతో
అనురాగాలతో
ఆప్యాయతతో
ఆహ్వానిద్దాం
దళితులపై దాడులను జగన్ ఎందుకు ఖండించడం లేదు?: చంద్రబాబు