telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

బంగ్లాతో సిరీస్ కు .. సంజూ శాంసన్‌..

sanju samson in team with bangladesh series

సంజూ శాంసన్‌ 2015లో టీమిండియాకు ఆడినా .. ఫిట్‌నెస్‌, క్రమశిక్షణ లోపాలతో జాతీయ జట్టుకు దూరమయ్యాడు. విజయ్‌ హజారేలో అత్యధిక పరుగులు 212* చేసి బంగ్లా సిరీస్‌కు ఎంపికయ్యాడు. తానెప్పుడూ పరిపూర్ణ బ్యాట్స్‌మన్‌ అయ్యేందుకు ప్రయత్నించలేదని సంజూ అంటున్నాడు. నిజమే, నా కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశాను. సురక్షితమైన, సులభమైన కెరీర్‌ ఉంటే నేర్చుకొనే అంశాలు తక్కువుంటాయి. ఎక్కువ సార్లు విఫలమైతే విజయవంతం అవ్వడమెలాగో తెలుస్తుంది. నా జీవితంలో ఎన్నోసార్లు విఫలమయ్యాను. నిలబడ్డాను. ఎదిగాను. నా కెరీర్‌ పట్ల బాధలేదు. నాపై ఎక్కువగానే అంచనాలున్నాయి. ముందు కన్నా నేనిప్పుడు బాగా ఆడాలి. టీమిండియాకు ముందుగానే ఎంపికవ్వాల్సింది. ఆలస్యంగానైనా సరే ప్రతి దానికీ ఒక సమయం వస్తుందని తెలుసుకున్నాను. నా గడ్డు కాలాన్నీ ఆస్వాదించానని సంజూ అన్నాడు.

ఈ ఐదేళ్లలో మానసికంగా, సాంకేతికంగా ఎన్నో మార్పులు జరిగాయి. వ్యక్తిగా నన్ను, నా ఆటను అర్థం చేసుకున్నాను. నా బలాలపై దృష్టిపెట్టాను. ఎప్పుడూ పరిపూర్ణ బ్యాట్స్‌మన్‌ అవ్వాలని ప్రయత్నించలేదు. ఎందుకంటే పరిపూర్ణులు ఎవరూ ఉండరని అర్థమైంది. ఇప్పుడన్నీ తేలిగ్గా స్వీకరిస్తూ ఆటను ఆస్వాదిస్తున్నా. మూడేళ్లుగా నా ఫిట్‌నెస్‌పై శ్రమించా. వివిధ వ్యక్తులు, ఫిజియోలు, శిక్షకులు ఎన్నో సలహాలు ఇచ్చారు. ఒక క్రమపద్ధతిలో కసరత్తులు చేశాను. 2018 ఐపీఎల్‌ తర్వాత గాయపడ్డాను. యోయో టెస్టుకు ముందు కోలుకోలేదు. ఈ విషయాన్ని ఫిజియోకు చెప్పలేదు. యోయో పాస్‌ అవుతాననే అనుకున్నా. కానీ కాలేదు. ఫిట్‌నెస్‌ నా విషయంలో సమస్యే కాదని సంజు అన్నాడు.

Related posts