telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సంజయ్ దత్ “ప్రస్థానం” ట్రైలర్

PRasthanam

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘”ప్రస్థానం”. తెలుగులో సూపర్ హిట్ గా నిలిచిన “ప్రస్థానం” చిత్రానికి ఇది రీమేక్.. కాగా సాయికుమార్ పోషించిన పాత్రను సంజయ్ దత్ పోషిస్తున్నాడు. ఈ సినిమాలో జాకీష్రాఫ్, అలీ ఫజల్, చుంకీపాండే, అమైరా దస్తూర్ , సత్యజీత్ దూబె, మనీషా కొయిరాలా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవాకట్టా దర్శకత్వం వహిస్తోన్న “ప్రస్థానం” ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో “తాతయ్య ఎవరినైనా చంపడం అంత తప్పా అని ఓ పిల్లాడు అడగ్గా… “చాలా తప్పు అంటూ సంజయ్ దత్ సమాధానం ఇస్తాడు. మరి రావణుడిని రాముడు ఎందుకు చంపాడని ప్రశ్నించగా… రావణుడు దెయ్యం కాబట్టి” అంటూ సంజయ్ జవాబిస్తాడు. అయితే చంపడం కూడా తప్పు కాదు కదా” అంటూ చిన్నారి సంభాషణలతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.

Related posts