telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సంజయ్ దత్ జైలు సంపాదనతో చేసిన పని ఇది… !

Sanjay-Dutt

కృతిసనన్, అర్జున్ కపూర్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘పానిపట్’. ఇందులో సంజయ్ అఫ్గానిస్థాన్ రాజు అహ్మద్ షా అబ్దాలీ అనే విలన్ పాత్రలో నటించారు. శుక్రవారం సినిమా రిలీజ్ అవబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సంజయ్ హిందీలో బాగా పాపులర్ అయిన ‘ది కపిల్ శర్మ’ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంజయ్‌దత్ తన వ్యక్తిగత విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తన జైలు జీవితానికి సంబంధించిన అనుభవాలు తెలియజేశారు. ఈ షోకి సంబంధించిన ప్రమోషన్ విడుదలయ్యింది. దానిలో సంజయ్ తాను జైలులో సంపాదించిన సొమ్ముతో ఏమి చేశాడో తెలిపారు. తాను జైలులో ఉన్నప్పుడు పేపర్ బ్యాగులు తయారు చేశానని, ఒక్కో బ్యాగుకు 10 పైసలు వచ్చేవని తెలిపారు. ఆ విధంగా వచ్చిన మొత్తాన్న రాఖీ పండుగ రోజున తన చెల్లెలికి ఇచ్చానని సంజయ్ తెలిపారు. ఈ మాట చెబుతున్నప్పుడు సంజయ్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు.

Related posts