telugu navyamedia
telugu cinema news

ఎన్నో ఆటుపోట్లు… ఇప్పుడు సంతృప్తిగా ఉన్నా… : సమంత

Samantha

పెళ్ళి తరువాత సమంత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎక్కువగా ఎంచుకుంటోంది. గత సంవత్సరం విడుదలై భారీ విజయం సాధించిన “రంగస్థలం” సినిమాలో సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాతో గ్లామర్ తో పాటు డీగ్లామర్ పాత్రలను కూడా పండించగలదని నిరూపించింది సమంత. ఇటీవల దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాకు “ఓ బేబీ” అనే టైటిల్ ను ఖరారు చేశారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో సమంత యువతిగానూ, వృద్ధురాలిగాను రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా తాజాగా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సమంత తన సినీ జర్నీని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ‘‘వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదగడానికి కాస్త సమయం పట్టింది. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా. ప్రస్తుతం నా ఎదుగుదలతో చాలా సంతృత్తిగా ఉన్నా. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన దేవుడు, వ్యక్తుల పట్ల కృతజ్ఞురాలిగా ఉంటా’’ అంటూ ట్వీట్ చేసింది సామ్.

Related posts

మరోసారి తెరపైకి “అర్జున్ రెడ్డి” జంట

vimala p

పక్కింటి అమ్మాయితో పరారైన హీరో

vimala p

“మారి-2” ట్రైలర్ : ఇఫ్ యూ ఆర్ బ్యాడ్… ఐయామ్ యువర్ డాడ్…

vimala p