ఎనర్జిటిక్ హీరో రామ్ గత ఏడాది జూలైలో “ఇస్మార్ట్ శంకర్” ప్రేక్షకులకు మాస్ లోని కిక్ ను రుచి చూపించి భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 9న “రెడ్” చిత్రంతో మరింత ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధమయ్యాడు. కెరీర్‌లో తొలిసారి థ్రిల్లర్ జోనర్‌లో సినిమా చేస్తున్నాడు రామ్. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఓ విజయవంతమైన సినిమాలోని ఆత్మను తీసుకొని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నివేదాపేతురాజ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ రోజు చిత్ర దర్శకుడు కిషోర్ తిరుమల బర్త్‌డే కావడంతో రెడ్ సినిమాకి సంబంధించిన మేకింగ్ సన్నివేశాలతో ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో రామ్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.