telugu navyamedia
సినిమా వార్తలు

వెంకటేష్ కుమార్తె పెళ్ళిలో సమంత ఫైట్

Samantha

ఇటీవల విక్టరీ వెంకటేష్ గారాలపట్టి ఆశ్రిత వివాహం హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు, రఘురామిరెడ్డి కుమారుడు వినాయక్ రెడ్డితో జైపూర్ లో జరిగిన విషయం తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. ఈ పెళ్ళికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్ళిలో సల్మాన్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక ఈ వేడుకలో అక్కినేని కుటుంబం కూడా పాల్గొంది. పెళ్ళిలో సమంత చేసిన సందడి అంతా ఇంతా కాదు. పెళ్ళి సందర్భంగా కుటుంబ సభ్యుల సమక్షంలో ఆర్మ్ రెజ్లింగ్ చేసి, గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది సమంత. ఆ సమయంలో రానా, చైతూ కూడా పక్కనే ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సమంత, నాగచైతన్య పెళ్ళి తరువాత జంటగా నటించిన “మజిలీ” చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక సమంత ప్రస్తుతం “ఓ బేబీ” సినిమాలో నటిస్తోంది. 

Related posts