telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మికా సింగ్ తో సల్మాన్… బ్యాన్ తప్పదంటూ హెచ్చరికలు

Salman-Khan

కశ్మీర్‌కి స్వయంప్రతిపత్తి కల్పించే అధికరణ 370ని భారత ప్రభుత్వం రద్దు చేయడంతో పాక్ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే మ‌న సినిమాల‌తో పాటు క‌ళాకారుల‌ని నిషేదించింది. ఈ నేపథ్యంలో ప్ర‌ముఖ గాయ‌కుడు మికా సింగ్ పాక్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు చెందిన సమీప బంధువు ఇంట్లో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి త‌న టీంతో వెళ్ళాడు. భార‌త్ – పాక్ మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న స‌మ‌యంలో మికా సింగ్ పాక్‌లో ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డంపై భారతీయులు ఆయ‌న‌పై ఫైర్ అవుతున్నారు. ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) అతనిపై నిషేధం విధించింది. దేశంలో పాటలు పాడడం, బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు సినిమాల్లో నటించడం పైనా నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి ఎఫ్‌డబ్ల్యూఐసీ ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే యూఎస్ లోని ఆరు ప‌ట్ట‌ణాల‌లో జ‌ర‌గ‌నున్న క‌న్స‌ర్ట్స్ కోసం స‌ల్మాన్ ఖాన్‌.. మికా సింగ్‌తో జ‌త‌క‌ట్టాడు. ఈ నేప‌థ్యంలో ఎఫ్‌డబ్ల్యూఐసీఈ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ అశోక్ దుబే స‌ల్మాన్‌కి హెచ్చ‌రిక‌లు జారీ చేశాడు. మేము నిషేధం విధించినట్లయితే, మా సాంకేతిక నిపుణులందరూ – నటులు, దర్శకులు మరియు స్పాట్ అబ్బాయిలతో సహా ఎవ‌రు మికాతో కలిసి పనిచేయరు. ఈ నిషేధ సమయంలో ఎవరైనా మికాతో కలిసి పనిచేస్తే, సల్మాన్ లేదా మరెవరైనా స‌రే అత‌డు కూడా నిషేధించబడతారు అని స్ప‌ష్టం చేశారు. ఈ రోజు మికా ఎసీసీడ‌బ్ల్యూఏ మెంబ‌ర్స్ ని క‌లిసి త‌న‌పై విధించిన నేషేదాన్ని తొలగించేలా చ‌ర్చలు జ‌ర‌పనున్నార‌ట‌.

Related posts