telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

‘బంపర్ ఆఫర్ -2’ తో వస్తున్న పూరి తమ్ముడు…

‘బంపర్ ఆఫర్’ సినిమాలో పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించి చక్కని విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్ర దర్శకుడు జయ రవీంద్ర రాయలసీమ నేపథ్యంలో సాయిరాం శంకర్ తోనే ‘బంపర్ ఆఫర్ -2’ మూవీ తెరకెక్కించబోతున్నాడు. ఉగాది రోజున ఈ కొత్త సినిమా షూటింగ్ మొదలు కాబోతోంది. అయితే… ఇది తమ గత చిత్రం ‘బంపర్ ఆఫర్’కు సీక్వెల్ కాదని, దీని కోసం ఓ కొత్త కథను తయారు చేసుకున్నామని, పేరు మాత్రం అదే పెట్టామని దర్శకుడు చెబుతున్నాడు. ఈ చిత్రాన్ని సురేశ్ యల్లంరాజుతో కలిసి సాయిరామ్ శంకర్ నిర్మిస్తుండటం విశేషం. దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత అదే పేరుతో పార్ట్ 2గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అశోక్ స్క్రిప్ట్ అందించాడు. ఏప్రిల్ మాసంలో మొదలయ్యే ఈ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ కు మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా పప్పు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించబోతున్నారు. దీనికి ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ డైరెక్టర్ వర్మ. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. చుడాలిమరి ఈ సినిమా ఎలా ఉండనుంది అనేది.

Related posts