telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మార్చి 15 నుంచి “హైబ్రీడ్” విధానంలో సుప్రీం కోర్టు నిర్వహణ…

court

ఈ నెల 15 నుంచి “హైబ్రీడ్” విధానంలో కోర్టు నిర్వహణ జరగనున్నట్లు సుప్రీంకోర్టు ప్రయోగాత్మక నిర్ణయం తీసుకుంది. మార్చి. విడతలవారీగా యధాతధ స్థితి కల్పించేందుకు చర్యలు చెప్పట్టారు. “కరోనా” కారణంగా సరిగ్గా ఏడాది తర్వాత కోర్టు ల విచారణలలో ప్రత్యక్షంగా తిరిగి పాల్గొనే అవకాశం ఉంది. అయితే, వీడియో ద్వారా లేదా ప్రత్యక్షంగా వాదనలు వినిపించే అవకాశం న్యాయవాదుల పై ఆధారపడి ఉంటుంది. మంగళవారం, బుధవారం, గురువారం నాడు అంతిమ విచారణ కేసులు విచారించనున్నారు. ప్రత్యక్షంగా కానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ వాద,  ప్రతివాదనలలో పాల్గొనవచ్చు.  పిటీషనర్లు, రెస్పాండెంట్లు రెండు విధానాలలో దేనినైనా ఎంచుకోవచ్చు. ఆ మోరకు, తగిన సాంకేతికపరమైన ఏర్పాట్లు చేస్తుంది పాలనా విభాగం. సోమవారం, శుక్రవారం కొత్త కేసులు, మెన్షనింగులు జరగనున్నాయి.  ఈ రెండు రోజులు మాత్రం న్యాయస్థానాలలో “వీడియో కాన్ఫరెన్స్” విధానం కొనసాగనుంది. మరి ఇది న్యాయవాదులు ఎంత ఉపయోగించుకుంటారు అనేది చూడాలి.

Related posts