telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

“నా గర్ల్‌ఫ్రెండ్ ఆకలితో లేదు” డిష్‌ వైరల్… ఆ రెస్టారెంట్ కు బారులుతీరుతున్న లవర్స్

Dish

అర్కాన్సస్‌లోని నార్త్ లిటిల్ రాక్‌లో గల మామా డీ’స్ అనే రెస్టారెంట్ యజమానికి వచ్చిన ఈ సరికొత్త ఆలోచన ఆయనకు కాసుల వర్షం కురిపిస్తోంది. చాలా మంది జంటలు బయట తినడానికి వెళ్లినప్పుడు నీకోసం ఎమైనా ఆర్డర్ చేయమంటావా అని అమ్మాయిల్ని అడిగితే మొదట నాకు ఆకలిగా లేదు నీవే ఎదైనా తెప్పించుకుని తినేయమని చెబుతారు. ఆ తరువాత ఫుడ్ రావడమే ఆలస్యం ఆర్డర్ ఇచ్చిన వ్యక్తికి అందకుండా మొత్తం లాగించేస్తుంటారు. అది గమనించే తాము “నా గర్ల్‌ఫ్రెండ్ ఆకలితో లేదు” అనే ప్రత్యేక డిష్‌ను ఫుడ్ మెనులో చేర్చామని యజమాని చెప్పుకొచ్చాడు. దీంట్లో మనం ఆర్డర్ చేసే ఏదైనా మీల్స్‌తో పాటు ఎక్స్‌ట్రా ఫ్రెంచ్ ఫ్రైయిస్, రెండు ఫ్రైడ్ చికెన్ వింగ్స్ లేదా మూడు ఫ్రైడ్ చీస్ స్టిక్స్ ఇస్తారు. దీని ఖరీదు 4.25 డాలర్లు. రెండు నెలల కిందట ఈ ఐడియాను అమలు చేసిన మామా డీ’స్ ఇప్పుడు భారీగా ఆర్జిస్తోంది. ఇక ఈ ప్రత్యేక డిష్‌(‘నా గర్ల్‌ఫ్రెండ్ ఆకలితో లేదు’)తో కూడిన మెను సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts