telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో సైడ్ ఎఫెక్ట్స్.. అమెరికా డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వార్నింగ్

Chloroqueen tablets

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్ కు ఫుల్ డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. మలేరియాకు ఉపయోగించే ఈ ఔషధం కరోనా చికిత్సలో మంచి ఫలితాలను ఇస్తుందనే అంచనాలతో దీనికి డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ డ్రగ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) హెచ్చరించింది.

హైడ్రాక్సీ క్లోరోక్విన్ వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.ఈ ఔషధానికి సంబంధించిన వివరాల్లో ముందుగానే వీటిని పొందుపరిచారని చెప్పింది. ఈ సైడ్ ఎఫెక్ట్ ని దృష్టిలో పెట్టుకుని చికిత్స అందించాలని సూచించింది. కరోనా బాధితుడి పరిస్థితిని బట్టి ఏ ఔషధం వాడాలనే విషయాన్ని అక్కడున్న వైద్య సిబ్బంది జాగ్రత్తగా నిర్ణయించాలని తెలిపింది.

కరోనాపై సమర్థవంతంగా పోరాడే ఔషధాల కోసం ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయని ఎఫ్డీఏ చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను వాడేందుకు అనుమతులు ఇచ్చామని తెలిపింది. ఈ డ్రగ్ వాడకానికి సంబంధించి పూర్తి వివరాలను వైద్యులకు అందుబాటులో ఉంచాలని సూచించింది.

Related posts