telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇక పబ్లిక్ గానే చైతూతో రొమాన్స్ చేయనున్న సమంత !

కింగ్ అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంలో బంగార్రాజు పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో “బంగార్రాజు” అనే టైటిల్ తో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకి సీక్వెల్ తీయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి కూడా ఓ పాత్రలో నటిస్తుండగా… సమంత కూడా సెకెండ్ హాఫ్ లో వచ్చే కీలక పాత్రలో నటించబోతోందని ఇప్పటికే ఆమెకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, కథ కూడా వినిపించాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది.  రియల్ లైఫ్ కపుల్ నాగ చైతన్య, సమంతా మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతున్నారట. గతంలో సామ్-చై ఏ మాయ చేసావె, ఆటోనగర్ సూర్య, మజిలి వంటి చిత్రాల్లో నటించారు. తాజా సమాచారం ప్రకారం మరోసారి ఈ రియల్ లైఫ్ జంట రీల్ లైఫ్ జంటగా కన్పించబోతున్నారట. నాగార్జున హీరోగా నటించనున్న “బంగార్రాజు”లో నాగ చైతన్య, సమంతా కలిసి నటించనున్నారు. అయితే దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. 

Related posts