telugu navyamedia
రాజకీయ

అభినందన్ ను వదిలిపెట్టడానికి అదే కారణం 

Pak Denies Permission Plane For Abhinandan
పాకిస్తాన్ లో పట్టుబడ్డ మన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్  ఈరోజు విడుదల అవుతున్నాడన్న వార్త భారతీయులందరికీ సంతోషాన్ని కలిగించింది . మొన్న  భారత భూభాగంలోకి వచ్చిన పాకిస్తాన్ యుద్ద విమానాన్ని కూల్చేసే  క్రమంలో వారి భూభాగంలో ప్యారాసుట్ ద్వారా దిగాడు . ఆ క్షణంలో అతను ఎక్కడున్నాడో తెలియదు . అక్కడ వున్న యువకులతో తానూ భారత దేశంలోనే వున్నాను కదూ ” అని అడిగాడు .
 
వారు అవును అని అబద్దం చెప్పారు . అది ఏ  ప్రాంతం అని మళ్ళీ అడిగాడు . వారు చెప్పిన సమాధానాన్ని బట్టి తాను  భారత్ లో  లేనని అతనికి అర్ధమైంది . భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ బోర్డుర్ వైపు పరిగెత్తసాగాడు . అప్పుడు ఆ యువకులు అభినందన్  వెనుకపడ్డారు . అభినందన్ తన దగ్గర వున్న పిస్టల్ తో గాల్లోకి కాల్పులు జరిపాడు . ఆ యువకులు రాళ్లను అభినందన్ పైకి విసరడం మొదలు పెట్టారు సమీపంలో వున్న చిన్న నీటి గుంటలో దిగి తన దగ్గర వున్న ముఖ్యమైన సమాచారాన్ని శత్రువు చేతికి చిక్కకుండా ఆ నీళ్లలో కలిపేసాడు ఈలోగా ఆ యువకులు వచ్చి అభినందన్ ను పట్టుకొని చితక బాదారు .
సమాచారం అందుకున్న  పాకిస్తాన్ జవానులు వచ్చి అభినందన్ ను రక్షించి మిలిటరీ వాహనంలో తీసుకెళ్లారు . అక్కడ అభినందన్ ను వారు మర్యాదగా చూశారు . అదే విషయాన్ని అభినందన్ వీడియో సందేశం ద్వారా తెలిపాడు . పాకిస్తాన్ మిలిటరీ ఆధీనంలో వున్నా అభినందన్ ను  జెనీవా  ఒప్పందం ప్రకారం విడుదల చెయ్యాలని భారత్  విజ్ఞప్తి చేసింది . ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ పాకిస్థాన్ పై వత్తిడి తెచ్చాయి . 
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ మొన్ననే  శాంతి చర్చలకు సిద్ధమని  తెలిపాడు  . నిన్న  పాకిస్తాన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ అభినందన్ ను నేడు  విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు .  ఒక వేళ తాము భారత్ తో యుద్ధం మొదలు పెడితే ప్రపంచ దేశాలన్నీభారత్ కె  సపోర్ట్ చేస్తాయని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ గ్రహించాడు అందుకే తాము యుద్ధ పిపాసులం కాదని  శాంతి కాముకులమని, సమస్యల పరిష్కారానికి  చర్చలే ముఖ్యమని చెప్పాడు. అభినందన్ పేరుతో పాకిస్తాన్ యుద్దాం నుంచి తప్పించుకుంది . 

Related posts