telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ ను మమత బెనర్జీతో పోల్చిన కేంద్రమంత్రి

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు వేడేక్కుతున్నాయి. ఎలాగైనా గెలవాలని అన్ని పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ పార్టీ అయితే.. ఏకంగా కేంద్రమంత్రులనే రంగంలోకి దించుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు వచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొక్రియాల్ తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు. బెంగాల్ ప్రభుత్వానికి.. తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం తీసిపోదని..సీఎం మమత బెనర్జీలా కేసీఆర్‌ సర్కార్‌ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఆయుష్మాన్ భారత్ , ఫసల్ భీమా యోజన పథకాలు అమలు చేయకపోవటం వలన తెలంగాణ పేద ప్రజలు నష్టపోతున్నారని… ప్రధాని మోదీ, బీజేపీకి పేరు రావటం ఇష్టంలేకనే కేంద్ర పథకాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయటంలేదని ఆరోపించారు. జనధన్ ఖాతాల వలనే లబ్ధిదారుల ఖాతాలలో సబ్సిడీలు క్రెడిట్ అవుతున్నాయని.. ఉజ్వల భారత్.. మోదీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశంలో లక్షల మంది పేద కుటుంబాలు లబ్ది పొందాయని తెలిపారు. కరోనా భయంతో అన్ని దేశాల విద్యార్థులు నష్టపోతే ఇక్కడ మాత్రం విద్యా సంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా రామచంద్రరావు గెలుపు పట్టభద్రులకు మేలు చేస్తోందని.. రామచంద్రరావును గెలిపించుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు.

Related posts