telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

అలర్ట్ : తెలంగాణలో మరో రెండు రోజులు ఊరుములతో కూడిన వర్షాలు

huge rain in 17 states in india

తెలంగాణకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ రోజు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కి మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని…ఈ రోజు (14వ.తేదీ) తెలంగాణాలోని చాలా ప్రదేశములలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది. 15వ తేదీన కూడా తెలంగాణాలో కొన్ని ప్రదేశములలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం వుందని తెలిపింది. 16వ తేదీన కూడా తెలంగాణాలో ఒకటి, రెండు ప్రదేశములలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం వుందని పేర్కొంది. తెలంగాణలోని ఒకటి రెండు ప్రదేశాలలో ( తూర్పు, పశ్చిమ, దక్షిణ మరియు మధ్య తెలంగాణా జిల్లాలలో) ఈ రోజు ఉరుములు మెరుపులు , ఈదురు గాలులు ( గాలి వేగం గంటకి 40 నుండి 50కిమీ ) మరియు వడగండ్లతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రేపు (15వ.తేదీ) ఉరుములు మెరుపులు* , ఈదురు గాలులు ( గాలి వేగం గంటకి 30 నుండి 40కిమీ ) మరియు వడగండ్లతో కూడిన వర్షాలు తెలంగాణా లో ( తూర్పు, పశ్చిమ, దక్షిణ మరియు మధ్య తెలంగాణా జిల్లాలలో) ఒకటి రెండు ప్రదేశాలలో వచ్చే అవకాశం ఉందని.. అలాగే ఎల్లుండి (16వ.తేదీ) ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణా లో *ఒకటి రెండు ప్రదేశాలలో వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

Related posts