స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య వాహనానికి ప్రమాదం జరిగింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ఎమ్మెల్యే రాజయ్య వాహనానికి ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇసుక లారీలు రోడ్ పై అకస్మాత్తుగా రావడంతో పోలీసు కాన్వాయ్ డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేసాడు. దీంతో… ఎమ్మెల్యే వాహనాన్ని కాన్వాయ్ వెనుక నుంచి ఢీ కొట్టింది పోలీస్ వాహనం. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే వాహనానికి ముందు బంపర్, మిర్రర్ ధ్వంసం అయ్యాయి. ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు ఎమ్మెల్యే రాజయ్య. ప్రమాదంలో స్వల్పంగా ధ్వంసమైంది ఎమ్మెల్యే రాజయ్య వాహనం. ఎమ్మెల్యే రాజయ్యకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు ఆయన అభిమానులు. ఆయనకు ప్రమాదం జరిగిందన్న విషయం తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
previous post
next post