telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కొత్త జిల్లాకు అల్లూరి పేరుపెట్టాలి: రఘురామకృష్ణరాజు

raghauramakrishnam raju mp

ఏపీలో కొత్త జిల్లాకు అల్లూరి పేరుపెట్టాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా సీఎం జగన్‌కు ఆయన ఓ లేఖ పంపారు. ఈ మేరకు జగన్‌కు ఆయన రెండు రోజుల క్రితం రాసిన లేఖను ఆయన క్యారాలయం ఈ రోజు విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా పేరు పెట్టాలని లేఖలో కోరారు.

గత అసెంబ్లీ ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన జగన్‌ ఆ సమయంలో ఈ విషయంపై ప్రజలకు హామీ ఇచ్చారని రఘురామకృష్ణరాజు తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం ఈ విషయంపై ఇప్పుడు సీఎం జగన్ అధికారికంగా ప్రకటన చేయాలని ఆయన కోరారు. కొత్త జిల్లాకు ఆ పేరు పెడితే ప్రజలు సంతోషపడతారని చెప్పారు.

Related posts