telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

“మనసు”

దివినుండి దేవున్ని రప్పించలేక
దేహాన్ని ఒప్పించలేక
అలవికాని కోరికలు అల్లుకు పోయి
మదిని కలిచి వేస్తుంటే
మనసు మాటవినక
మమత చేరువవక
మారు మాటరాక
ఎదురు చూస్తుంది
దిగులుగా దిక్కుతోచక మనసు
………………………
కవివై కల్పనవై
కవితాలోక దీరవై
నాలోకలిగే కోరికవై
ఉప్పొంగే ఉషస్సువై
విహరించే విరాగివై
ననువలచే వలపువై
కవ్వించే తలపువై
విరహంలొ కరిగిపోయే
కాలానివై నాపాలిట
స్వామివై ననుచేరే
చిరు మందహాసానివై
నాలో ఒదిగిపోయే ప్రేమ నీకు వందనం
శుబోదయం నీవై నాలో
ఉదయకాంతిలా ప్రకాశిస్తావ్ కదూ

Related posts