telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఇండియాకు రష్యా ఆక్సిజన్ సరఫరా…

oxygen sylender

కరోనా రోగులకు ఇచ్చే ట్రీట్మెంట్ లో ముఖ్యమైనది ఆక్సిజన్. అయితే ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.  మహమ్మారి నుంచి బయటపడటం కష్టంగా మారింది.  కరోనా తీవ్రత పెరగడంతో మరణాల సంఖ్య పెరుగుతున్నది.  ఆసుపత్రులపై ఒత్తిడి, ఆక్సిజన్ సరఫరాకు డిమాండ్ పెరిగింది.  ఈ సమయంలో ఇండియాకు సహాయం అందించేందుకు రష్యా ముందుకు వచ్చింది.  ఇండియాకు అవసరమైన ఆక్సిజన్ తో పాటుగా అత్యవసరంగా వినియోగించే రెమ్ డెసివీర్ ఇంజెక్షన్లను సరఫరా చేసేందుకు అంగీకారం తెలిపింది.  వారానికి నాలుగు నుంచి ఐదు లక్షల వ్యాక్సిన్లు అందిస్తామని రష్యా హామీ ఇచ్చింది.  ఇక ఓడల ద్వారా ఆక్సిజన్ ను ఇండియాకు సరఫరా చేసేందుకు కూడా రష్యా అంగీకరించింది.  చూడాలి మరి ఇంకా ఏం జరగనుంది అనేది.

Related posts