telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

ఇక నా తదుపరి లక్ష్యం 2020-టోక్యో ఒలంపిక్స్‌: సింధు

pv singhu into pre quarters

బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి, స్వర్ణం సాధించిన తెలుగుతేజం సింధు స్వదేశంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం గోపిచంద్ అకాడమీలో విలేకర్లతో ఆమె మాట్లాడుతూ ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎన్నో సంవత్సరాల కల నెలవేరిందని తెలిపారు. ఈ విజయం కోసం చాలా ఏళ్లు ఎదురు చూశా. విజయం కోసం నాకు ఎల్లవేళలా వెన్నంటి ఉన్న గోపి సర్‌కి, కిమ్ మేడమ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేనని చెప్పింది.

ఇక నా తదుపరి లక్ష్యం 2020-టోక్యో ఒలంపిక్స్‌లో స్వర్ణం. దీనికోసం చాలా పోటీ ఉంటుందని తెలుసు. కానీ, నా వ్యూహాలు నాకున్నాయి. ఒలంపిక్స్‌కు ముందు చాలా టోర్నీలు ఆడాలి. సూపర్ సిరీస్‌లు ఆడాలి. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ, ఎప్పటికప్పుడు తన టెక్నిక్స్ మెరుగుపరుచుకుంటాను. టాప్-10 ప్లేయర్స్ అందరికీ తమ బలాలు, బలహీనతలు తెలుసు. కావున, కొత్త వ్యూహాలతో బరిలోకి దిగాలి. ఈ సందర్భంగా అండగా నిలిచిన అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

Related posts