telugu navyamedia
సినిమా వార్తలు

నటించడం మానేసి చదవమంటున్నారు.. ప్రియా వారియర్

Priyaa Prakash Varriar images

ఒక్క కన్నుగీటుతో ఇంటర్నెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన వింక్ గర్ల్ ప్రియా వారియర్ కు యూత్ లో విపరీతమైన క్రేజ్ వుంది. అయితే ఆమె మొదటి సినిమా “ఒరు ఆదార్ లవ్” సినిమా ఆమెను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో తన క్రేజ్ మరింత పెంచుకునే సినిమాలు చేసే పనిలో ఆమె వుంది. తాజాగా ఒక హిందీ సినిమా చేస్తోన్న ఆమె, తెలుగులోను చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక సినిమాను చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ “నాకు సినిమా అవకాశాలు వస్తున్నాయి కదా అని చదువు ఆపేయమని నా తల్లిదండ్రులు ఎప్పుడూ అనలేదు. మా టీచర్స్ కూడా ముందు చదువు పూర్తిచేయమనే అంటూ వుంటారు. కాలేజ్ కి వచ్చేయమని అంటుంటారు. కానీ నిజానికి నేనేమీ ఫస్టు క్లాస్ స్టూడెంటును కాదు .. పైగా నాకు నటన అంటేనే ఇష్టం. అయినా మరో ఏడాదిలో డిగ్రీ పూర్తిచేసేస్తాను. ఆ తరువాత సినిమా అవకాశాలపైనే ఎక్కువ దృష్టిపెట్టాలని అనుకుంటున్నాను… ఇక సహనటుడు రోషన్ అబ్దుల్ తో కలిసి మరో సినిమాలో నటించే ఛాన్స్ ఉంది. ఇంకా ఈ సినిమా విషయం ఫైనల్ కాలేదు” అని చెప్పుకొచ్చింది.

Related posts