telugu navyamedia
సినిమా వార్తలు

“ప్రేమకథాచిత్రమ్-2” ట్రైలర్

Premakathaa-CHitram-2

2013లో సుధీర్ బాబు, నందిత జంటగా నటించిన “ప్రేమకథా చిత్రం” విడుదలై ఎవరూ ఊహించలేని అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ను రూపొందిస్తున్నారు. “ప్రేమకథా చిత్రం-2” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, నందిత శ్వేతా జంటగా నటిస్తున్నారు. సిద్ధి ఇద్నాని ఓ కీలకమైన పాత్రలో నటిస్తోంది. హరికిషన్ అనే దర్శకుడు ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నాడు. హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆర్.సుదర్శన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ప్రధాన పాత్రలు, హారర్ కామెడీ సన్నివేశాలతో ట్రైలర్ ను ఆసక్తికరంగా కట్ చేశారు. “సంథింగ్ ఈజ్ రాంగ్… అదేంటో తెలుసుకోవాలి” అంటూ హీరో చేశే ప్రయత్నాలు, ‘ఏం జరుగుతుందో అర్థం కావడం లేదా?” అనే నందిత శ్వేత డైలాగ్ సినిమాపై ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఈ ట్రైలర్ లో ప్రేమ, కామెడీ, సస్పెన్స్ తదితర అంశాలను ఆకట్టుకునేలా చూపించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts