ఆ మధ్య స్టార్ హీరోయిన్ లు నా లవర్లు అంటూ పిచ్చి పిచ్చి కూతలు కూసిన సునిశిత్ ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఇక కొన్నియూట్యూబ్ ఛానెల్స్ కూడా సునిశిత్ ఇంటర్వ్యూలకోసం ఎగబడటంతో దాంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అసభ్య పదజాలంతో హీరోయిన్ల గురించి మాట్లాడటం, వారి వ్యక్తిగత విషయాల గురించి ఇంటర్వ్యూల్లో చెప్పడం వంటివి చేసాడు సునిశిత్. అంతే కాకుండా ప్రముఖ దర్శకులు తనతో సినిమా చేస్తామని చెప్పి మోసం చేశారని కూడా వ్యాఖ్యలు చేసాడు. ఇబ్రహీంపట్నం కీసరలో సునిశిత్ పై కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హీరోయిన్ల పరువు ప్రతిష్ట తో ఆటలాడుకుంటున్న సునిశిత్ పై రాచకొండ కమిషనరేట్ లో రెండు కేసులు నమోదు అయ్యాయి.
previous post
next post