telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ మూవీలో సింగిల్ షాట్ కు 2 కోట్లు

Prabhas

ప్రభాస్ రేంజ్ ఏ మాత్రం తగ్గకుండా బాహుబలి చిత్రం తరువాత దర్శకుడు సుజీత్ ‘సాహో’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందించారు. అయితే ఆ సినిమాలో భారీతనం ఉంది కాని.. బాహుబలి లాంటి కంటెంట్ లేకపోవడంతో ప్రేక్షకుల్ని నిరాశ పరిచింది. ప్రస్తుతం ప్రభాస్ ‘జిల్’ ఫేమ్.. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో రొమాంటిక్ లవ్ స్టోరీ చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘జాన్’, ‘ఓ డియర్’, ‘రాధే శ్యామ్’ టైటిల్స్ ప్రచారంలో ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. కీలకమైన యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా సింగిల్ షాట్ కు రూ.2 కోట్లు ఖర్చు చేశారట. ఈ సినిమాలో ఈ సీన్ హైలైట్ కాబోతుందని సమాచారం. ఈవారంలో జార్జియా షెడ్యూల్ పూర్తికావడంతో యూరప్ పయనమౌతోంది చిత్ర యూనిట్.

Related posts