telugu navyamedia
news telugu cinema news

ప్రభాస్ 100 కోట్ల రెమ్యునరేషన్ నిజమేనా…?

Prabhas

మన తెలుగు హీరో 100 కోట్ల రెమ్యునరేషన్ దాటేశాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా హీరో అయిపోయిన ప్రభాస్ బాలీవుడ్ స్టార్స్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అని తెలుస్తుంది. మొదట సాహో, ఇప్పుడు రాధే శ్యామ్ సొంత బ్యానర్ ‘యూవీ క్రియేషన్’ లో తెరకెక్కడంతో ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంత అనేది తెలియలేదు. కానీ కొత్తగా అనౌన్స్ చేసిన సలార్, ఆదిపురుష్ సినిమా తర్వాత బాలీవుడ్ లో టాపిక్ మొత్తం ప్రభాస్ గురించే. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో, సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా టీ-సిరీస్ నిర్మిస్తుండటంతో ప్రభాస్ రెమ్యునరేషన్ గురించి చాలా పుకార్లు వచ్చాయి. అందులో ప్రభాస్ ఈ సినిమాకు 100 కోట్లు తీసుకుంటున్నాడు అనేది ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదే నిజం అయితే అంత భారీ రెమ్యునరేషన్ అందుకున్న మొదటి హీరో ప్రభాస్ అవుతాడు. ఇక ఈ విషయం లో తెలుగు హీరోలో ప్రభాస్ తర్వాతి స్థానాల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఉన్నారు. అయితే ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు 100 కోట్లు తీసుకుంటే సలార్ కు ఇంకా ఎంత తీసుకుంటున్నాడు అనేది తెలియదు.

Related posts

హైద్రాబాద్ లో రోడ్డేక్కిన సిటీ బస్సులు

vimala p

ఏబీ వెంకటేశ్వరావు వ్యవహారంపై సుప్రీంలో ఏపీ సర్కారు పిటిషన్!

vimala p

విరాళంగా బంగారు గాజులు.. ప్రశంసించిన చంద్రబాబు

vimala p