telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బాలీవుడ్ లో రవితేజ క్రాక్ రీమేక్…?

KRack

ఎప్పటినుండో సరైన హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్న మాస్ మహరాజ్ రవితేజ కు క్రాక్ భారీ వసూళ్లు చేసి ఊహించని స్థాయిలో విజయాన్ని అందుకొని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేయాలిన చూస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హీరో ఎవరు చేస్తారన్నది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. మొదట ఈ సినిమాను హిందీలో రియల్ హీరో సోనూసూద్ హీరోగా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. కాని ప్రస్తుతం మాత్రం ఈ సినిమా చేయనున్న హీరోలుగా కేవలం ముగ్గురి పేర్లే వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు రీమేక్ సినిమాలు చేసి వాటిలో ఒకటి భారీ హిట్ అందుకున్న షాహిద్ కపూర్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, బాలీవుడ్ అగ్రహీరో అజయ్ దేవగన్‌లు ఈ రేసులో ఉన్నారు. మరి ఈ ముగ్గురిలో క్రాక్ సినిమాను హిందీలో ఎవరు చేస్తారన్నది తేలాల్సి ఉంది. ఈ సినిమాను హిందీలో కూడా గోపీచంద్ మలినేని చేయనున్నాడట. అయితే బాలీవుడ్‌లో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా తెలుగులో పవర్ ఫుల్ మాస్ మసాలా సినిమాగా తెరకెక్కింది. అదే స్థాయిలో ప్రజాదరణ కూడా పొందింది. మరి ఈ సినిమా హిందీలో ఏమాత్రం ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

Related posts