telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

పోర్టబులిటీ మరింతగా .. సులభతరం చేసిన .. ట్రాయ్ ..మూడురోజుల్లోనే..

portability in just 3 days by trai

భారతదేశంలో ఎన్నో టెలికాం రంగ సంస్థలు మొబైల్ వినియోగదారులకు సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. మొబైల్ వినియోగదారులు కూడా వివిధ నెట్వర్క్లను వాడుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క నెట్వర్క్ ని వాడుతూ ఉంటారు. ఏ నెట్వర్క్ అయినా చార్జీలు భారీగా పెంచింది అనుకోండి… వేరే నెట్వర్కు మారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. చౌకగా ఛార్జీలు ఉండే నెట్వర్క్ ఏది అని సెర్చ్ చేస్తూ ఉంటారు మొబైల్ వినియోగదారులు. అటు టెలికాం రంగ సంస్థలు కూడా తక్కువ ఛార్జీల ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో టెలికాం రంగ సంస్థలు ప్రకటించిన తక్కువ చార్జీల ఆఫర్లకు ఆకర్షితులై కొంతమంది నెట్వర్క్ చేంజ్ కావాలి అనుకుంటారు. నెట్వర్క్ చేంజ్ కావాలి అంటే పోర్టబులిటీ చేయాల్సిందే. పోర్టబులిటీ చేస్తే కచ్చితంగా ఏడు రోజుల సమయం పడుతుంది. దీంతో చాలామంది మొబైల్ వినియోగదారులు పోర్టబులిటీ కి ఏడు రోజుల సమయం పడుతుండటంతో… పోర్టబులిటీ ద్వారా తమ నెట్వర్క్ చేంజ్ చేసుకునేందుకు కాస్త వెనక ముందు ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది పోర్టబులిటీ వారం రోజుల సమయం పట్టినా తక్కువ చార్జీలతో నెట్వర్క్ రాబోతుంది కదా అంటూ సిద్ధమవుతారు.

మొబైల్ నెట్వర్క్ పోర్టబులిటీ చేసుకోచాలనుకునే వినియోగదారులకు ట్రాయ్ సంస్థ శుభవార్త చెప్పింది. మొబైల్ నెట్వర్క్ పోర్టబులిటీ సవరణ ప్రక్రియపై నోటీసు జారీ చేసింది ట్రాయ్ సంస్థ. ప్రస్తుతం మొబైల్ వినియోగదారులు అందరూ ఒక టెలికాం సంస్థ నెట్వర్క్ నుంచి మరో టెలికాం సంస్థ నెట్వర్కు తన మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ చేసుకునేందుకు 7 రోజుల సమయం పడుతుంది. కాగా ట్రాయ్ తీసుకువచ్చిన కొత్త నిబంధన ప్రకారం ఈ మొబైల్ నెట్వర్క్ చేంజ్ కేవలం మూడు రోజుల్లోనే పూర్తి కానుంది. ఈనెల 16 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఇదిలా ఉంటే అటు అన్ని టెలికాం రంగ సంస్థలు తమ ఛార్జీలను ఒక్కసారిగా పెంచేసాయి. దీంతో ఇన్ని రోజులు తక్కువ ఛార్జీలు ఉన్న ఆఫర్లతో కాలం గడిపిన మొబైల్ వినియోగదారులు అందరూ భారీగా పెరిగిన ఛార్జీలతో ఇప్పుడు బెంబేలెత్తిపోతున్నారు. ఒకవేళ నెట్వర్క్ చేంజ్ చేసి వేరే నెట్వర్కు వెళ్దాం అనుకుంటున్నా.. వేరే నెట్వర్క్ లో కూడా పెంచిన చార్జీలు ఉండడంతో ఉన్న నెట్వర్క్ లోని కొనసాగుతున్నారు.

Related posts