telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఎన్నికలలో పోటీకి … 2 కోట్లు, 60 మంది కొత్తవారు.. : పవన్ కళ్యాణ్…

pavan kalyan on his plans for elections

రాబోయే ఎన్నికలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి పెరిగిపోతుంది. నాటి ప్రజారాజ్యం పార్టీ అనుభవాలతో నేడు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వస్తున్న అనేక ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పుకుంటూ, ముందడుగులు వేస్తున్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ. 2 వేల కోట్లు అవసరమవుతాయని చాలా మంది తనతో చెప్పారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇప్పటికే అధికార, ప్రతిపక్షాలు అందుకు సన్నద్ధంగా ఉన్నాయని తనకు తెలిసిందని చెప్పారు. రాజకీయాలను నడపడానికి డబ్బు అవసరం లేదని… అదే విషయాన్ని బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరాం రుజువు చేశారని తెలిపారు. తనకు కాన్షీరామే మార్గదర్శి అని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో 175 సీట్లకు గానూ 60 చోట్ల కొత్తవారినే బరిలోకి దింపుతామని ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాల్లో సమతుల్యత కోసమే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నామని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికి స్ఫూర్తి కలిగించినవాళ్లలో తానూ ఒకడినని పవన్ అన్నారు. అమరావతిలో ప్రకాశం జిల్లా జనసేన నేతలు, కార్యకర్తలతో పవన్ ఈరోజు సమావేశమయ్యారు.

Related posts