*కడప స్టీల్ ప్లాంట్ పై ప్రశ్నోత్తరాల్లో చర్చ
*కడప స్టీల్ ప్లాంట్ ఎప్పటికి పూర్తి చేస్తారు
*మూడేళ్ళు పూర్తవుతుంది..ఒక్క ఇటుక కూడా వేయలేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నాడు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను స్పీకర్ తమ్మినేని సీతారాం చేపట్టారు. కడప స్లీల్ ప్లాంట్ పై టీడీపీ సభ్యులు ప్రశ్నించారు.ఈ సందర్భంగా టీడీపీ శాసనసభ పక్ష ఉప నేత అచ్చెన్నాయుడు కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఏ దశలో ఉందో చెప్పాలని కోరారు.
తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో సీఎం జగన్ సొంత జిల్లా కడపలో స్టీల్ ప్లాంట్ కోసం అప్పటి సీఎం చంద్రబాబు ఫౌండేషన్ వేశారని అచ్చెన్నాయుడు అన్నారు. దాన్ని పక్కన పెట్టి మరో చోట సీఎం జగన్ 23 డిసెంబర్ 2019న శంఖుస్ధాపన వేశారని గుర్తుచేశారు.
ఎట్టి పరిస్ధితుల్లో కడప స్టీల్ ప్లాంట్ పూర్తిచేసి ఎన్నికలకు వెళ్తామని సీఎం జగన్ చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు..వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడేళ్ల అయ్యింది..ఇప్పటివరకు ఒక్క ఇటుక ముక్క కూడా అక్కడ వేయలేదని ఎద్దేవా చేశారు.
ఏపీ విభజన తర్వాత కడప స్టీల్ ప్లాంట్ పై సీఎం జగన్ ఒక్కసారి కూడా కేంద్రాన్ని అడగలేదు. కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభం కాలేదు, విశాఖ ఉక్కు ప్రమాదంలో పడింది, ఏకంగా ప్రైవేటేకరణ జరుగుతోంది.
కడప స్టీల్ ప్లాంటుకు పేదలు భూములిచ్చిన వారికి అదనంగా రూ. లక్ష ఇస్తామని చెప్పారు కడప స్టీల్ ప్లాంట్ ఎప్పటికి పూర్తి చేస్తారో మంత్రి చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
పారిశ్రామికాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించలేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరిస్తున్నా ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. విభజన చట్టంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి స్టీల్ ప్లాంట్ ను పూర్తి చేసే పని చేయలేదని ఆరోపించారు.
దీనికి మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సమాధనమిస్తూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. కరోనా వల్ల రెండేళ్లు ఎలాంటి పనులు చేపట్టలేకపోయామని అన్నారు.
కచ్చితంగా ఈ ఫ్యాక్టరీని కడపలో ఏర్పాటు చేయాలని ఏపీ పునర్విభజన చట్టంలో లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఐదేళ్లలో ఎందుకు పనులు చేయలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
పరిశ్రమల శాఖ మంత్రి అమరనాధ్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పెట్టుబడులు ఏపీకి అనేకం వస్తున్నాయని తెలిపారు.
పట్టాభికి నవంబర్ 4 వరకు రిమాండ్..