telugu navyamedia
political Telangana trending

మల్కాజ్ గిరిలో .. 40 కి 27 నామినేషన్లు తిరస్కరణ ..

telangana reservations for panchayat

రాష్ట్రంలో అతిపెద్ద లోక్ సభ నియోజకవర్గాల్లో ఒకటైన మల్కాజిగిరిలో రిటర్నింగ్ అధికారులు 27 మంది నామినేషన్లు తిరస్కరించారు. మొత్తం 40 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, నిబంధనల మేరకు నామినేషన్లు, అఫిడవిట్లు లేవంటూ 27 మంది వేసిన నామినేషన్లను తిరస్కరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మల్కాజిగిరి నుండి బరిలో 13 మంది మిగిలారు. వీరిలో కాంగ్రెస్‌ నుంచి రేవంత్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నుంచి మర్రి రాజశేఖర్‌ రెడ్డి, బీజేపీ నుంచి ఎన్‌ రాంచందర్‌ రావులు ప్రధానంగా పోటీ పడుతున్నారు.

ఇక ఇతర పార్టీల అభ్యర్థుల విషయానికి వస్తే, ప్రజాసత్తా నుంచి ధర్మాసనం భానుమూర్తి, ఇండియా ప్రజాబంధు పార్టీ నుంచి బురు బాలమణి, జనసేన నుంచి మహేందర్‌రెడ్డి, సోషల్‌ జస్టీస్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి చామకూర రాజయ్యలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా సీహెచ్ చంద్రశేఖర్‌, ఇందూరం తిరుపతయ్య, దొంతుల భిక్షపతి, పంబాల శివరాజ్‌, పొన్నాల రాజేందర్‌, గోనే సాయికిరణ్‌ లు ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు వుండటంతో, వీరిలో ఎవరు మిగులుతారన్న విషయం రేపు తేలుతుంది.

Related posts

అచ్చెన్నాయుడు అరెస్ట్ పై చంద్రబాబు ఆగ్రహం

vimala p

స్వప్రయోజనాల కోసమే కేసీఆర్, జగన్ కలుస్తున్నారు: బీజేపీ ఎంపీ సంజయ్

vimala p

హైదరాబాద్ : …మద్యంసేవించి అమ్మమ్మపై అత్యాచారయత్నం.. కేసునమోదు ..

vimala p