telugu navyamedia
telugu cinema news

అభిమానులకు మెగాస్టార్ ఓనం శుభాకాంక్షలు

Mohan-Lal

ప్రజలను సమానంగా చూస్తూ, వారు సంతోషంగా ఉండేలా పూర్వం కేరళ రాష్ట్రాన్ని పాలించిన రాజు మహాబలి గౌరవార్థం కేర‌ళ రాష్ట్ర ప్రజలు ప్రతి ఏడాది ఓనం పండుగను ఎంతో ఘ‌నంగా జరుపుకుంటూ ఉంటారు. ప‌లు ప్రాంతాల‌లో ఉండే మ‌ల‌యాళీలు ఓనం రోజున ముంగిళ్లలో ముగ్గులు వేసి వాటిని సుందరంగా అలంకరిస్తారు. పండుగ రోజున‌ మగవారు చొక్కా మరియు ముండు అని పిలవబడే లుంగీ ని ధ‌రిస్తే , స్త్రీలు ముండు మరియు నరియతు అనబడే ఒక బంగారు పై ఆచ్చాదనను ధరిస్తారు. ఆడపిల్లలు పావడ మరియు రవికె ధరిస్తారు. ఈ పండుగని కేర‌ళ ఆచార సంప్ర‌దాయాల ప్ర‌కారం ప‌ది రోజుల పాటు జ‌రుపుకుంటారు. అయితే ఈ రోజు ఓనం ఫెస్టివ‌ల్ సంద‌ర్భంగా ప‌లువురు సెల‌బ్రిటీలు ఓనం విషెస్ తెలిపారు. సంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌ని ధ‌రించి వారింట్లో త‌యారు చేసిన స్పెష‌ల్ వంట‌కాల‌ను కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ ఓ వీడియో ద్వారా ఓనం శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అంద‌రు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాల‌ని ఆయ‌న కోరారు.

Related posts

మెగా అభిమానులకు గుడ్ న్యూస్… చిరు 152వ ప్రాజెక్ట్ అప్డేట్

vimala p

నాగబాబు వల్లే గెలిచామా ? మీరెవరు చెప్పడానికి ? : జీవితరాజశేఖర్

vimala p

“ఇస్మార్ట్ శంకర్” ఫస్ట్ డే కలెక్షన్స్

vimala p