telugu navyamedia
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండకు ఇష్టమైన డ్రెస్ కియారాకు గిఫ్ట్…

Vijay-Devarakonda-with-Kiara-Adwani

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన “అర్జున్ రెడ్డి” చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్, కైరా అద్వానీ జంటగా “కబీర్ సింగ్” టైటిల్ రీమేక్ చేశారు. హిందీ వర్షన్ కి కూడా సందీప్ వంగానే దర్శకత్వం వహించారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి “కబీర్ సింగ్” చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. షాహిద్ కపూర్ నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే 100 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం 200 కోట్ల రికార్డును క్రియేట్ చేయడానికి పరుగులు తీస్తోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం విజయానికి గుర్తుగా కియారా అద్వానీకి విజయ్ దేవరకొండ ఓ బహుమతిని పంపాడు. తనకు ఎంతో ఇష్టమైన డ్రెస్ ను గిఫ్ట్ గా పంపుతున్నానని… తప్పుగా అనుకోవద్దని ఒక మెసేజ్ కూడా పంపాడు. ఈ విషయం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గిఫ్ట్ పంపినందుకు విజయ దేవరకొండకు కియారా ధన్యవాదాలు తెలిపింది. ఈ చిత్ర విజయం పట్ల దర్శకుడు, నటీనటులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related posts