telugu navyamedia
సినిమా వార్తలు

అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ కొత్త టైటిల్… సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా ?

Allu-Arjun

“నా పేరు సూర్య”తో భారీ డిజాస్టర్ ను చూసిన అల్లు అర్జున్ తన తరువాత సినిమా కోసం చాలా సమయం తీసుకున్నారు. ఇప్పుడు ఒకేసారి మూడు సినిమాలను లైన్లో పెట్టేశారు. ఇటీవల త్రివిక్రమ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు బన్నీ. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు భారీ హిట్ ను అందుకున్నారు. దీంతో ఈ ప్రాజెక్టుపై కూడా అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. ఈ నెల 24న ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, టబు, రాజేంద్ర ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాకి అంతకుముందు “నాన్న నేను” అనే టైటిల్ విన్పించింది. కానీ ఇప్పుడు మాత్రం “అలకనంద” అనే టైటిల్ దాదాపుగా ఖాయమైందని సమాచారం. బన్నీ కొత్త చిత్రానికి త్రివిక్రమ్ “అలకనంద” అనే టైటిల్ అనుకోవడం వెనుక బలమైన కారణమే ఉందట… అదేమిటంటే త్రివిక్రమ్ ఇంతకుముందు పది చిత్రాలను డైరెక్ట్ చేయగా వాటిలో ఐదు సినిమాల టైటిల్స్ “అ” అనే అక్షరంతోనే ప్రారంభమయ్యాయి. ‘అతడు’తో మొదలుకుని ‘అత్తారింటికి దారేది’, ‘అ ఆ’, ‘అజ్ఞాతవాసి’, ‘అరవింద సమేత’ వరకు ఇదే తీరు కొనసాగింది. ఈ చిత్రాలు మంచి విజయాన్ని అందుకోవడంతో అదే సెంటిమెంటుతో కొత్త చిత్రానికి కూడా “అలకనంద” అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నారట మన మాటల మాంత్రికుడు. మరి ఆరోసారి సెంటిమెంట్‌ని కంటిన్యూ చేయనున్న త్రివిక్రమ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూద్దాం. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Related posts