telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఎన్టీఆర్ జీవితంపై పాఠ్యాంశం.. కేసీఆర్ కు బాలకృష్ణ కృతజ్ఞతలు

ntr tdp

దివంగత ఎన్టీఆర్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ కు అమితమైన గౌరవాభిమానాలు ఉన్న సంగతి తెలిసిసిందే. సందర్భాల్లో ఎన్టీఆర్ పై కేసీఆర్ ప్రశంసలు కురిపించిన సంగతి విధితమే. అంతేకాదు, ఎన్టీఆర్ మీద అభిమానంతో తన తనయుడికి తారకరామారావు అని పేరు కూడా పెట్టుకున్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ పదో తరగతి పాఠ్యపుస్తకాల్లో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఒక పాఠ్యాంశాన్ని ముద్రించారు.

సోషల్ స్టడీస్ లో పేజీ నంబర్ 268లో ఎన్టీఆర్ కు సంబంధించిన కీలక అంశాలను పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో పెట్టడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క, తన తండ్రి జీవితాన్ని గురించి భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా పాఠ్య పుస్తకంలో ప్రచురించడం పట్ల నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఫేస్ బుక్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts